మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

మాయాజాలం

Jan 25 2026 7:12 AM | Updated on Jan 25 2026 7:12 AM

మాయాజ

మాయాజాలం

పాడేరు ఏజెన్సీ ప్రాంతంలోని జాఫ్రాకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్‌ ఉన్నా, స్థానిక గిరిజన రైతులకు మాత్రం శ్రమకు తగ్గ ఫలితం పొందలేకపోతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ సంపద గిరిజనుల పాలిట ‘ఎర్ర బంగారం’ కావాలే తప్ప, వారి కళ్లలో నీళ్లు తెచ్చేలా ఉండకూడదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర కల్పనకు చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు.
సిండికేట్‌

ధర పతనం అన్యాయం

గతేడాది కన్నా కిలోకు రూ.200 తగ్గించి రూ.250కు కొనుగోలు చేయడం అన్యాయం. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి జాఫ్రా గింజల ధరలను పతనం చేశారు. జీసీసీ.పాడేరు ఐటీడీఏలు కూడా గిట్టుబాటు ధరలు కల్పించడం లేదు. జీసీసీ కొనుగోలు చేసి ఉంటే జాఫ్రా గింజల వ్యాపారానికి పోటీ ఉండేది. గిట్టుబాటు ధర లభించక భారీగా నష్టపోతున్నాం.

– కూడా కొండబాబు, గిరిజన రైతు,

కరకపుట్టు, పాడేరు మండలం

నష్టాల వల్లే కొనుగోలుకు దూరం

జాఫ్రా గింజలను గతంలో జీసీసీ గిట్టుబాటు ధరతో కొనుగోలు చేసేది.కొనుగోలు చేసిన వెంటనే మార్కెటింగ్‌ జరిగే పరిస్థితి లేకపోవడంతో గింజలు బాగా ఆరిపోయి బరువు తగ్గిపోవడంతో అప్పట్లో జీసీసీ నష్ట పరిస్థితులను ఎదుర్కొంది. ఈ కారణంతోనే జాఫ్రా గింజల కొనుగోలుకు జీసీసీ దూరమైంది.

– వి.కృష్ణప్రసాదరావు, డీఎం, జీసీసీ, పాడేరు

సాక్షి, పాడేరు: మన్యంలో ప్రకృతి సిద్ధంగా లభించే ’జాఫ్రా’ (లిప్‌స్టిక్‌ సీడ్స్‌) గిరిజన రైతులకు కన్నీళ్లు మిగులుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటికి భారీ డిమాండ్‌ ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో గిరిజనులకు మాత్రం దళారుల దోపిడీ తప్పడం లేదు. గతేడాది కిలో రూ.450 పలికిన ధర, ఈసారి ఏకంగా రూ.250కు పడిపోవడం వెనుక వ్యాపారుల సిండికేట్‌ హస్తం స్పష్టంగా కనిపిస్తోంది.

అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్నా..

జాఫ్రా గింజలను కేవలం అద్దకం రంగులకే కాకుండా, ఫుడ్‌ కలర్స్‌, సౌందర్య సాధనాలు (లిప్‌స్టిక్‌ తయారీ), మరియు ఔషధాల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల నుంచి విదేశాలకు సైతం ఇవి ఎగుమతి అవుతాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పంటకు కనీస మద్దతు ధర లేకపోవడం గిరిజనుల పాలిట శాపంగా మారింది.

జీసీసీ ఉదాసీనత.. దళారులకు వరం

గిరిజన సహకార సంస్థ ఈ గింజల కొనుగోలుకు ముందుకు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత మూడేళ్లుగా జీసీసీ మార్కెట్లోకి రాకపోవడంతో, ప్రైవేటు వ్యాపారులు తమకు నచ్చిన ధరకే కొనుగోలు చేస్తున్నారు.

మౌలిక సదుపాయాల కొరత

గింజలను నిల్వ చేసే కోల్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యాలు లేకపోవడంతో, గిరిజనులు నిల్వ చేసుకోలేక వచ్చిన ధరకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది.

ఒడిశా వ్యాపారుల ప్రభావం

సరిహద్దు రాష్ట్రమైన ఒడిశా నుంచి వచ్చే వ్యాపారులు కూడా స్థానిక వ్యాపారులతో చేతులు కలిపి ధరను అదుపు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

పెట్టుబడి కూడా రాని పరిస్థితి

ఒక జాఫ్రా చెట్టు నుంచి గింజలను సేకరించి, వాటిని ఎండబెట్టి, శుభ్రం చేయడానికి ఎంతో శ్రమ అవసరం. ఒక చెట్టుకు సుమారు 7 కిలోల వరకు గింజలు దిగుబడి వస్తాయి. సుమారు వెయ్యి ఎకరాల్లో సాగవుతున్న ఈ పంట ద్వారా వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. గతేడాది రూ.50 వేల ఆదాయం వస్తే, ఈసారి రూ.25 వేలు కూడా వచ్చేలా లేదు.

ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుతో..

ఏజెన్సీ ప్రాంతంలోనే జాఫ్రా గింజల నుంచి రంగును వేరు చేసే చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తే గిరిజనులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ దిశగా ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టాలి.

అప్పులు తీర్చేది ఎలా?

గిరిజన రైతులను ఆదుకోవాలంటే ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. జాఫ్రాకు కనీసం కిలోకు రూ.500 మద్దతు ధర కల్పించాలి. వెంటనే సంతల్లో జీసీసీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వ్యాపారుల సిండికేట్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.

జాఫ్రా రైతు కష్టం దళారుల పాలు

ఎకరాకు రూ.వేలల్లో పెట్టుబడి

ధర పతనంతో దయనీయం

రూ.450 నుంచి రూ.250కు ధర పడిపోయిన వైనం

ఆదుకోని జీసీసీ, ప్రభుత్వం

ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు, మద్దతు ధర కల్పనలో విఫలం

సాగుదారుల ఆవేదన

మాయాజాలం1
1/2

మాయాజాలం

మాయాజాలం2
2/2

మాయాజాలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement