మెరిసిన ముగ్గులు.. విద్యుత్ దీప కాంతులు
సాక్షి,పాడేరు: మోదకొండమ్మతల్లి తీర్థ మహోత్సవాల్లో భాగంగా శనివారం ఆలయ ప్రాంగణంలో శనివారం ముగ్గుల పోటీలు వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. గూడెంకొత్తవీధి జెడ్పీటీసీ కిముడు శివరత్నం, కమిటీ ప్రతినిధులు ముగ్గులను పరిశీలించారు. తీర్థమహోత్సవం పురస్కరించుకుని పాతబస్టాండ్‌లోని అంబేద్కర్ సెంటర్, ఆలయం రోడ్డు విద్యుత్ దీపాల సెట్టింగ్‌లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.


