జగనన్నను సీఎం చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

జగనన్నను సీఎం చేయడమే లక్ష్యం

Jan 25 2026 7:12 AM | Updated on Jan 25 2026 7:12 AM

జగనన్

జగనన్నను సీఎం చేయడమే లక్ష్యం

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,

పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు

పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపు

చింతపల్లి: పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలన్న లక్ష్యంతో పార్టీ శ్రేణులు ఇప్పటినుంచి కష్టపడి పనిచేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక జెడ్పీ అతిథి గృహంలో పార్టీ మండల అధ్యక్షుడు పాంగి గణబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. వీటిని పార్టీ శ్రేణులు సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. రానున్నది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని, కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ప్రతీ పంచాయతీలో 40 మంది క్రియాశీలక కార్యకర్తలకు అవకాశం కల్పించేలా గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచ్‌ స్థానాలు కైవసం చేసుకునేలా కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ప్రజారంజక సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మాయమాటలతో పాలన సాగిస్తోందని ఆయన ఆరోపించారు. కార్పొరేట్‌ వైద్యం పేదలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 17 వైద్య కళాశాలలను ప్రారంభిస్తే వాటిని కూడా తన ఖాతాలో వేసుకునే దుర్మార్గపు ప్రచార ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని దుయ్యబట్టారు. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కురసా పార్వతమ్మ, ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ బాలయ్యపడాల్‌, రాష్ట్ర ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్‌, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బూసరి కృష్ణారావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దురియూ పుష్పలత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ అధక్షురాలు జల్లి హలియారాణి, సర్పంచ్‌లు లలిత, రమణమ్మ, మహేశ్వరి, లక్ష్మయ్య, రమేష్‌నాయుడు గోపాల్‌ు, ఎంపీటీసీలు ధారలక్ష్మి, నాగలక్ష్మి, మీనాకుమారి, మోహన్‌రావు, పద్మ, కోఆప్షన్‌ సభ్యుడు నాజర్‌వల్లి, మాజీ మండల అధ్యక్షుడు మోరి రవి, పార్టీ సీనియర్‌ నాయకులు గంగన్నపడాల్‌, కరుణానిధి, సింహాచలం, రఘునాథ్‌, బెన్నిబాబు పాల్గొన్నారు.

కూటమి మోసాలను ఎండగట్టాలి

గూడెంకొత్తవీధి: కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రతీ కార్యకర్త ఎండగట్టాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ హయాంలో సంక్షేమ పథకాలు అందరికి అందేవన్నారు. అన్ని వర్గాలకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యమిచ్చి సుపరిపాలన అందించారన్నారు. నాడు వలంటీర్ల ద్వారా గడపగడపకు సంక్షేమ పథకాలు అందేవన్నారు. టీడీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కార్యకర్తలు నడవాలని సూచించారు.పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించాలని కోరారు. కార్యకర్తలు విధిగా సభ్యత్వం పొందడం వల్ల బీమా వస్తుందని తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరిబాబు, ఎంపీపీ బోయిన కుమారి, రాష్ట్ర పంచాయతీ రాజ్‌ అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్‌, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురసా పార్వతమ్మ, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌ కుమార్‌, జిల్లా క్రిస్టియన్‌ మైనారిటీ అధ్యక్షులు వసుపతి తిమోతి, మండల ఉపాధ్యక్షులు అరుణ్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ లోతా దేముడు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కుందెరి రామకృష్ణ, నియోజకవర్గం రైతు విబాగం అధ్యక్షుడు కంకిపాటి రామారావు, యువజన విభాగం అధ్యక్షుడు లంబసింగి రమేష్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండల కార్యదర్శులు వంతల చంటిబాబు చందు, సిరిబాల రామారావు తదితరులు పాల్గొన్నారు.

జగనన్నను సీఎం చేయడమే లక్ష్యం1
1/1

జగనన్నను సీఎం చేయడమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement