ఎదురెదురుగా బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ఎదురెదురుగా బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

Jan 25 2026 7:12 AM | Updated on Jan 25 2026 7:12 AM

ఎదురె

ఎదురెదురుగా బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

డుంబ్రిగుడ: జాతీయ రహదారిలో అంత్రిగుడ– పంతలచింత మలుపు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. శనివారం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. మండలంలోని కితలంగి పంచాయతీ పంపులుగుడ గ్రామానికి చెందిన గొల్లోరి సుబ్బారావు (24) అనే యువకుడు డుంబ్రిగుడ నుంచి అరకులోయ వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో అరకులోయ నుంచి పాడేరు వైపు వస్తున్న బైక్‌ అతని వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో సుబ్బారావు అక్కడిక్కడే మృతి చెందాడని ఎస్‌ఐ తెలిపారు. గాయపడిన ఇద్దరు అరకులోయ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

అడుగులపుట్టు ఘాట్‌లో కారు, బైక్‌ ఢీకొని..

పెదబయలు: మండలంలోని అడుగులపుట్టు ఘాట్‌ మలుపు వద్ద శనివారం ఎదురెదురుగా వస్తున్న కారు,బైక్‌ ఢీకొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ముంచంగిపుట్టు నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు, పెదబయలు నుంచి ముంచంగిపుట్టు వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. కారు ముందు భాగం దెబ్బతింది. బైక్‌ ధ్వంసమైంది.

ఎదురెదురుగా బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి1
1/2

ఎదురెదురుగా బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

ఎదురెదురుగా బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి2
2/2

ఎదురెదురుగా బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement