క్రమశిక్షణతో మెలగాలి
● సబ్ కలెక్టర్ సాహిత్, డీఎస్పీ సాయిప్రశాంత్
రంపచోడవరం: యువత మంచి క్రమశిక్షణతో మంచి లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించేందుకు కష్టపడాలని సబ్ కలెక్టర్ సాహిత్, రంపచోడవరం సాయిప్రశాంత్ సూచించారు. అభ్యుదయం కార్యక్రమంలో భాగంగా స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పీఎంఆర్‌సీ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఏజెన్సీలో ఎక్కడా గంజాయి లేకుండా పోలీసుశాఖ చర్యలు చేపట్టిందని, అక్కడక్కడ జరుగుతున్న రవాణాపై కూడా ప్రత్యేకదృష్టి పెట్టి అడ్డుకట్ట వేస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పాఠశాలలు, కళాశాలల్లో యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాలాజీ, సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ వెంకట్రావు పాల్గొన్నారు.


