సమస్యలు పరిష్కరించాలని వినతి
చింతూరు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 104 ఉద్యోగులు శనివారం చింతూరులో పోలవరం జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ సరిత, చింతూరు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పుల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమపై యాజమాన్యం వేధింపులు, షోకాజ్ నోటీసులు, సస్పెండ్ వంటి చర్యలను నిలుపుదల చేయాలన్నారు. రద్దుచేసిన 15 క్యాజువల్ సెలవులను తక్షణమే పునరుద్ధరించాలని, ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు అదనపు సిబ్బందిని నియమించాలని, తొలగించిన బఫర్ సిబ్బందిని పునరుద్ధరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు కోట్ల పవన్‌కుమార్, గుయ్యం నవీన్‌కుమార్, అల్లి మనోహర్ పాల్గొన్నారు.


