విద్యార్థులకు నాణ్యమైన భోజనం
అరకులోయటౌన్: మండలంలోని గురుకులం బాలికల కళాశాల, బాలికల పాఠశాల, కేజీబీవీ పాఠశాలలను అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గురువారం సాయంత్రం అకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులం బాలికల పాఠశాలలోని తరగతి గదులు, స్టాక్‌రూమ్‌లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మత్స్యలింగం విద్యార్థినులతో మాట్లాడారు. ప్రతీ రోజు మెనూ ప్రకారంగా భోజనాలు పెడుతున్నారా లేదా అని విద్యార్థినులకు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారంగా నాణ్యమైన భోజనాలు వండి వడ్డించాలని, కాచిచల్లార్చిన నీటిని అందించాలని వసతి గృహాం నిర్వహాకులకు సూచించారు. విద్యార్ధులకు వండి వడ్డిస్తున్న భోజనాలను రుచి చూసారు. గురుకులం పాఠశాల ప్రహారి శిధిలమైన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి విద్యార్థులు, సిబ్బంది తీసుకురావడంతో పాడేరు ఐటిడీఏ పీఓ తిరుమణి శ్రీపూజతో ఫోన్‌లో మాట్లాడి బాలికల వసతి గృహంలో ప్రహరీ లేక సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలియజేయగా, త్వరలోనే ప్రహరీ నిర్మిస్తామని హామి ఇచ్చారన్నారు. కళాశాల, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
అరకులోయ ఎమ్మెల్యే మత్స్యలింగం


