తప్పుడు ఆరోపణలు తగవు
గంగవరం: మండల కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ నాయకుల సమావేశం గురువారం జరిగింది.ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు, రంపచోడవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశరావు విలేకరులతో మాట్లాడారు. పిడతమామిడి గ్రామంలో బుధవారం జరిగిన సంఘటన గురించి పూర్తిగా తెలుసుకోకుండా ప్రజలకు పక్క దారి పట్టించే విధంగా ఎమ్మెల్యే శిరిషా దేవి మాట్లాడం సరికాదని వారన్నారు. వైఎస్సార్‌సీపీ, నాయకులపై ఎమ్మెల్యే గాని, టీడీపీ నాయకులు గాని ఇకపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశరావు, ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీలు రామతులసి, గంగాదేవి, కో–ఆప్షన్ సభ్యుడు కె.ఎస్.ప్రభాకర్, జిల్లా కార్యదర్శి ఏడుకొండలు, కొత్తాడ, పిడతమామిడి, మొల్లేరు సర్పంచ్‌లు కామరాజుదొర, నేషం మరిడమ్మ, కుంజం లక్ష్మి, నెల్లిపూడి సొసైటీ మాజీ అధ్యక్షులు సంకుమళ్ల ఏసు, దాసరి వెంకటేశ్వరరావు, యూత్ కమిటీ సభ్యులు సతీష్, రామకృష్ణ, మేడిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు


