నిరసన సంతకం
గంగవరంలో కోటి సంతకాల ప్రతుల తరలింపు ర్యాలీని ప్రారంభిస్తున్న
రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
మాట్లాడుతున్న పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, ఎమ్మెల్యే మత్స్యలింగం, చైర్‌పర్సన్ సుభద్ర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అసెంబ్లీ పరిశీలకుడు సత్యారావు
కోటి సంతకాల ప్రతులను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు అందజేస్తున్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
కోటి సంతకాల ప్రతులు తరలించే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న అరకు పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, తదితరులు
ర్యాలీకి తరలిరావాలి
పాడేరు : రాష్ట్రంలో ప్రజల సొత్తు అయిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీపరం చేసే హక్కు టీడీపీ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని.. ప్రైవేటీకరణపై ప్రజా తిరుగుబాటు తప్పదని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు హెచ్చరించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సేకరించిన సంతకాలను బుధవారం పాడేరులో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు 15ఏళ్ల సీఎం చరిత్రలో రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేయలేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మకంగా ఏకంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తే జీర్ణించుకోలేని చంద్రబాబు, వాటిని ప్రైవేట్‌పరం చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాటిపై ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన సేకరించిన సంతకాల ప్రతులతో ఈనెల 15న జిల్లా కేంద్రమైన పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించి విజయవాడ తరలించి పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ఈనెల 17న రాష్ట్ర గవర్నర్‌కు అందజేస్తామని ఆయన తెలిపారు.
ప్రజలకు నష్టం జరిగితే ఊరుకోం:
బొడ్డేడ ప్రసాద్ హెచ్చరిక
కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఉవ్వెత్తున ముందుకు వచ్చి సంతకాలు చేసి మద్దతు తెలిపారని వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. ప్రజలకు నష్టం జరిగితే తమ పార్టీ తరఫున చూస్తూ ఊరుకోమని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ప్రజారోగ్యాన్ని విస్మరించిన టీడీపీ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
వైఎస్సార్‌సీపీ నిత్యం పేదల పక్షాన ఉంటూ వారి సంక్షేమం కోసమే పని చేస్తుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళి భాగ్యలక్ష్మి అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 17 వైద్య కళాశాలలను నెలకొల్పి ఉన్నత వైద్యాన్ని ప్రజల ముంగిటకు తెచ్చిందన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమంతో పాటు ప్రజారోగ్యాన్ని పూర్తిగా నీరు గార్చిందన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ మండల అధ్యక్షలు, అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
● అరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సేకరించిన 53వేల సంతకాల ప్రతులను జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజుకు బుధవారం సాయంత్రం పాడేరు పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అందజేశారు. పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి(పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప పరిశీలకులు) ఏడువాక సత్యారావు సమక్షంలో ఆయన స్వీకరించారు.
విజయవంతంగా ప్రజా ఉద్యమం :
మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
గంగవరం : ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాల్లో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమం విజయవంతంగా సాగిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. నియోజకవర్గంలో గ్రామస్థాయిలో ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను బుధవారం కాకినాడ జిల్లా కేంద్రానికి తరలించే సందర్భంగా నిర్వహించిన కార్లు, బైక్ ర్యాలీని గంగవరం సెంటర్‌లో ఆమె ప్రారంభించారు. వివిధ మండలాల నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ కుట్రలో భాగంగా ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తమ పార్టీ ఎప్పుటికప్పుడు ఎండగడుతుందన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో తాను, ఎమ్మెల్సీ అనంతబాబు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేశారన్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గంగవరం, రంపచోడవరం, అడ్డతీగల, వై.రామవరం, రాజవొమ్మంగి, దేవీపట్నం మండలాలకు చెందిన ఎంపీపీలు పల్లాల కృష్ణారెడ్డి, రాఘవ, బంధం శ్రీదేవి, మురళి, జెడ్పీటీసీలు బేబిరత్నం, పండా వెంకటలక్ష్మి, జి. వెంకటలక్ష్మి, సత్యవేణి, మద్దాలవీర్రాజు, వైస్‌ఎంపీపీలు రామతులసి, గంగాదేవి, గారపాటి మురళి, కొమ్మిశెట్టి బాలకృష్ణ, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు యెజ్జు వెంకటేశ్వరరావు, రామన్నదొర, రామకృష్ణ, మురళీ, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశరావు, బూత్‌కమిటీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రఘునాథ్, జిల్లా కార్యదర్శి ఏడుకొండలు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేసి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలిపారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన
సంతకాల సేకరణకు విశేష స్పందన
స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజలు
‘అరకు’ ప్రతులను పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజుకు అందజేసిన ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
సేకరించిన సంతకాల ప్రతులను పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రదర్శన
ప్రజల సొత్తు ప్రైవేట్ పరం చేసే హక్కు టీడీపీ ప్రభుత్వానికి లేదని
పార్టీ జిల్లా అధ్యక్షుడు స్పష్టీకరణ
ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరిక
కోటి సంతకాల సేకరణ ప్రతులతో పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, అరకు అసెంబ్లీ పరిశీలకుడు సత్యారావు


