మాచ్‌ఖండ్‌లో శతశాతం ఉత్పాదన
ముంచంగిపుట్టు: ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన శాతశాతం జరుగుతోంది. గత ఏడాది ఆగస్టులో రెండు రోజులు మాత్రమే శాతశాతం విద్యుత్ ఉత్పాదన జరిగిన అనంతరం రెండో నంబరు జనరేటర్ మరమ్మతులకు గురవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రెండవ నంబరుకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయినట్లు ప్రాజెక్టు అధికారులు గుర్తించారు. తరచూ జనరేటర్లు మరమ్మతులు గురవుతూ వస్తున్నాయి. ప్రాజెక్టు అధికారులు శ్రమిస్తున్నా అత్యంత పురాతన జలవిద్యుత్ కేంద్రం కావడంతో మరమ్మతులు చేపట్టి కొద్దిరోజులు మాత్రమే పని చేస్తున్నాయి. సమస్యను జెన్‌కో ఉన్నతాధికారుల దృష్టికి ప్రాజెక్టు అధికారులు తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన జెన్‌కో అధికారులు రూ.40 లక్షలు కేటాయించారు.దీంతో ప్రాజెక్టు అధికారులు,సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఈ నెల 8వ తేదీన 2వ నెంబరు జనరేటర్‌కు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఆరు జనరేటర్ల సాయంతో రోజుకు 2.8 మిలియన్ యూనిట్ల ఉత్పాదన జరుగుతోంది. శతశాతం విద్యుత్ ఉత్పత్తికి కృషి చేసిన ప్రాజెక్టు ఎస్‌ఈ ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఇంజినీర్లు, సిబ్బందికి బుధవారం ఏపీజెన్‌కో హైడల్ డైరెక్టర్ సుజయ్‌కుమార్ ఫోన్‌లో అభినందించారు.


