నిర్వాసితుల డేటా తయారు చేయండి
కూనవరం: పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముంపు నిర్వాసితులకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెం గ్రామంలో పునరావాసం కోరుకున్న నిర్వాసితుల డేటాను తయారు చేయాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ ఆదేశించారు. స్థానిక పోలీస్‌స్టేషన్ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన ఆర్‌అండ్‌ఆర్ గ్రామసభలో ఆయన మాట్లాడారు. కూనవరంలో 798 మంది నిర్వాసితులు తాడ్వాయిలో పునరావాసం కోరుకున్నారని తెలిపారు. వీరికి స్థలసేకరణలో ఎలాంటి అభ్యంతరాలు లేనందున వారి నుంచి గృహ నిర్మాణానికి సంబంధించిన డేటా సిద్ధం చేయాలని తహసీల్దార్ ధర్మేంద్రను ఆదేశించారు. ఆప్షన్లు వారీగా నిర్వాసితుల జాబితా తయారు చేయాలని సూచించారు. టేకులబోరు ఎస్సీ కాలనీకి చెందిన కొందరు తాడ్వాయిలో స్థలం లేదు వేరోచోట కావాలని కోరడంతో వారికి 5,6 నంబర్లతో ఎల్లో బ్లాక్‌లో స్థలసేకరణ జరిగిందన్నారు. అయినా మరోమారు ఆస్థలం చూసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. ఆస్థలంపై అభిప్రాయం తెలియజేయాలన్నారు. తాడ్వాయిలో స్థలాల ఎంపిక, వాటికి సంబంధించిన డేటా ప్రక్రియ అంతా పూర్తి చేసిన తరువాత మిగిలిన నిర్వాసితుల విషయంపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంవీఎస్‌ఎస్ జగన్నాథరావు, ఎస్‌ఐ లతశ్రీ తదితరులు పాల్గొన్నారు.
నిర్వాసితుల డేటా తయారు చేయండి


