మెరుగైన సేవలు అందించాలి
రంపచోడవరం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులకు సత్వర వైద్య సేవలు అందించి, ఉచితంగా మందులు అందజేయాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్ ఆదేశించారు. మారేడుమిల్లి మండలం బోదులూరు పీహెచ్‌సీని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్‌సీలో వైద్యులు ,సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి పంపించాలన్నారు. బోదులూరు పీహెచ్‌సీలో పరిధిలో గర్భిణులు, బాలింతల వివరాలు తెలుసుకున్నారు. మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం మద్దులూరు గ్రామంలోని వెదురు ప్లాంటేషన్‌ను పీవో పరిశీలించారు. ప్లాంటేషన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.


