13న ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం
మద్దిలపాలెం(విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాల యం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం(వేవ్స్ 2025) ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు సంఘం చైర్మన్ కె.వి.వి రావు తెలిపారు. మంగళవారం ఏయూ అలుమ్ని జీఎంఆర్ సెమినార్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహిళా సాధికారత థీంతో వేవ్స్ 2025 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపీ, మూర్తి ట్రస్ట్ చైర్‌పర్సన్ సుధామూర్తి హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందని, అలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జీఎంఆర్ కూడా పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్‌తో కలిసి వేవ్స్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సంఘ ఉపాధ్యక్షుడు డాక్టర్ కె.కుమార్ రాజ, జనరల్ సెక్రటరీ ఆకుల చంద్రశేఖర్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు.


