సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం
అవగాహన కల్పిస్తున్న అధికారులు
పాడేరు రూరల్: ప్రతిఒక్కరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఆ శాఖ జిల్లా అధికారి ఎంవీ రామకృష్ణంరాజు సూచించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించాలని సూచించారు. పౌరసమాచార అధికారి సంతోష్, వివిధ శాఖల అధికారులు మరిడయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


