టీబీ రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలి
ముంచంగిపుట్టు: టీబీ రోగులను గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి జిల్లా కుష్టు, ఎయిడ్స్,టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ కిరణ్‌కుమార్ ఆదేశించారు. స్థానిక సీహెచ్‌సీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. టీబీ ల్యాబ్ రికార్డులను, కఫం పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో పరిశీలించారు. అనంతరం లబ్బూరు పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నమోదవుతున్న కేసులు,అందిస్తున్న వైద్యం వివరాలు తెలుసుకున్నారు. వైద్యాధికారి ప్రసాద్‌తో మాట్లాడి మందుల వివరాలు, ప్రసవాల గురించి తెలుసుకున్నారు. టీబీ రోగులను మెరుగైన వైద్య సేవలు అందించాలని, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి గ్రామస్థాయిలో టీబీ రోగులను గుర్తించడం, వైద్య అందించడం, మందుల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పలు గ్రామాల్లో టీబీ రోగుల ఇళ్లకు వెళ్లి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి సంజీవ్‌పాత్రుడు,హెల్త్ విజిటర్ కాసులమ్మ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగులు రామచందర్, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


