గిరిజన యువతకు క్రికెటర్ కరుణకుమారి ఆదర్శం
పాడేరు రూరల్: ఆదివాసీ యువతీ, యువకులకు మహిళ అంథుల టి20 క్రికెటర్ పాంగి కరుణకుమారి ఆదర్శమని పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి తెలిపారు. ఆమె పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం క్రికెటర్ పాంగి కరుణకుమారి స్వగ్రామం వంట్లమామిడిలో సందర్శించారు. అనంతరం క్రికెటర్ కరుణకుమారిని శాలువాతో ఘనంగా సన్మానించి, అభినంధించారు, ఆనంతరం ఆమె మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో పుట్టి పెరిగి ఒక్క ఆంధురాలుగా టి20 క్రికెట్‌లో ఘన విజయం సాధించడం ఆదివాసీలకు ఎంతో గర్హకారణమన్నారు. ఆమెకు శిక్షణ అందించిన కోచ్ అజయ్‌కుమార్‌రెడ్డిని అభినందించారు. త్వరలోనే వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిపిస్తామన్నారు. సర్పంచ్ రాంబాబు, సుహసిని, మాజీ ఎంపీటీసీ గోపి, మాజీ వైస్ ఎంపీపీ మీనా, నాయకులు పద్మ, నూకరాజు, చిట్టిబాబు, బాబూరావు, పాస్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి


