పడిపోతున్న ఉష్ణోగ్రతలు
చింతపల్లి : జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. చలిగాలుల తీవ్రత పెరగడంతో మన్యం గజగజలాడుతోంది. ఆదివారం జి.మాడుగులలో 5.3 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 7.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ పరిధి డుంబ్రిగుడలో 8.2, అరకువ్యాలీలో 8.9 డిగ్రీలు, చింతపల్లిలో 9.5 డిగ్రీలు, హుకుంపేటలో 9.6 డిగ్రీలు, పెదబయలులో 10.2 డిగ్రీలు పాడేరులో 10.9 డిగ్రీలు కొయ్యూరులో 13.1 డిగ్రీలు నమోదు అయినట్టు ఏడీఆర్ తెలిపారు.
● రంపచోడవరం డివిజన్‌న్ వై.రామవరంలో 11.5 డిగ్రీలు, మారేడుమిల్లిలో 13.0 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 13.1 డిగ్రీలు, అడ్డతీగల, రంపచోడవరంలో 16.2 డిగ్రీలు, చింతూరు డివిజన్ చింతూరులో 15.0 డిగ్రీలు, ఎటపాకలో 15.8 డిగ్రీలు నమోదు అయినట్టు ఏడీఆర్ పేర్కొన్నారు.
జి.మాడుగులలో 5.3, ముంచంగిపుట్టులో 7.7 కనిష్ట ఉష్ణోగ్రతల నమోదు


