ఫైనాన్స్ కంపెనీలను నిషేధించాలి
చింతూరు: ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న గిరిజనేతర ఫైనాన్స్ కంపెనీలను నిషేధించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సోడె రాఘవయ్య డిమాండ్ చేశారు. ఆదివారం చింతూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లోని పోలవరం నిర్వాసితులను ఫైనాన్స్ కంపెనీలు మభ్యపెడుతున్నాయన్నారు. ట్రాక్టర్లు, కార్లు, బైక్‌లు ఫైనాన్స్ చేస్తామంటూ పోలవరం పరిహారం కాజేసేందుకు యత్నిస్తున్నారని, దీనివవల్ల నిర్వాసితులు ఆర్థికంగా నష్టపోయే అవకాశముందని ఆయన సూచించారు. అధికారులు ఇలాంటి ఫైనాన్స్ కంపెనీలపై దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసీల ఉపాధి కోసం సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, తాటిబెల్లం, తాటినీరా, స్వీట్ల తయారీ వంటి పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రవ్వ ప్రసాద్, మిడియం కొండయ్య, పాయం రవి, భవానీ, లక్ష్మి, పావని పాల్గొన్నారు.
ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సోడె రాఘవయ్య డిమాండ్


