ఒకమారు కలిసిన అందం | - | Sakshi
Sakshi News home page

ఒకమారు కలిసిన అందం

Dec 8 2025 8:04 AM | Updated on Dec 8 2025 8:04 AM

ఒకమార

ఒకమారు కలిసిన అందం

ఏయూక్యాంపస్‌: విశాఖ యువతకు ఒక మధురానుభూతిని పంచుతూ గాయకుడు కార్తీక్‌ లైవ్‌ షో ఆదివారం సాయంత్రం ఎంజీఎం గ్రౌండ్‌లో ఉత్సాహంగా జరిగింది. ‘చిలిపిగ చూస్తా ని న్నే’ వంటి గీతా లను ఆలపిస్తూ కార్తీక్‌ ప్రేక్షకులను అలరించారు. ‘మహా గణపతి మనసా స్మరామి’ అనే శాసీ్త్రయ గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, అనంతరం ‘ఒకమారు కలిసిన అందం’ వంటి పాటలతో యువతలో జోష్‌ నింపింది. సుమారు రెండు గంటలకు పైగా సాగిన మ్యూజిక్‌ కన్సర్ట్‌కు నగర యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్తీక్‌తో గొంతు కలిపారు. తన పాటలతో కార్తీక్‌ సండే సాయంత్రాన్ని సంగీత సాగరంగా మార్చగా, యువత ఉత్సాహంగా స్టెప్పులేశారు. ‘ఏముందిరా వైజాగ్‌’ అంటూ కార్తీక్‌ అన్న మాటలకు యువత కేరింతలు కొట్టింది. కార్యక్రమానికి భారీగా జనం తరలిరావడంతో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, పార్కింగ్‌ ఏర్పాట్లు, క్యూలైన్ల నిర్వహణ వంటి అంశాల్లో పోలీసులకు కొంత ఇబ్బంది తప్పలేదు.

ఉత్సాహంగా కార్తీక్‌ మ్యూజిక్‌ షో

ఒకమారు కలిసిన అందం 1
1/1

ఒకమారు కలిసిన అందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement