రసవత్తరంగా రోలర్ హాకీ
విశాఖస్పోర్ట్స్: జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. పోటీల్లో భాగంగా ఆదివారం వీఎంఆర్డీఏ పార్కులోని రింక్–1, రింక్–2లలో టైనీటాట్స్, కాడెట్, సబ్ జూనియర్ విభాగాల రోలర్ హాకీ పోటీలను నిర్వహించారు. చిన్నారులు తమ స్కేటింగ్ విన్యాసాలతో వీక్షకులను ఆకట్టుకున్నారు. వివిధ రాష్ట్రాల జట్లను రెండు పూల్స్‌గా విభజించి పోటీలు నిర్వహించారు. టైనీటాట్స్ బాలుర తొలి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌తో కేరళ జట్టు, రెండో మ్యాచ్‌లో కర్నాటక జట్టు ఏ పూల్‌లో తలపడ్డాయి. కాడెట్ బాలురలో ఆంధ్రప్రదేశ్‌తో కర్నాటక జట్టు ఏ పూల్‌లో తలపడగా, కాడెట్ బాలికల్లో ఆంధ్రప్రదేశ్‌తో కేరళ బీ పూల్‌లో పోటీపడింది. సబ్ జూనియర్ బాలుర విభాగం బీ పూల్‌లో ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణ, బాలికల విభాగం ఏ పూల్‌లో ఏపీతో కర్నాటక పోటీపడ్డాయి.
సబ్‌జూనియర్ మిక్స్‌డ్ కేటగిరీ బీ పూల్‌లో ఆంధ్రప్రదేశ్‌తో తమిళనాడు, మరో మ్యాచ్‌లో ఏపీతో కేరళ తలపడ్డాయి. మరోవైపు డైనమిక్ స్కేట్‌బోర్డ్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆదివారం ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. సోమవారం నుంచి వీఎంఆర్డీఏ పార్క్‌లోని స్కేట్‌బోర్డ్ వేదికగా ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ విభాగంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చండీగఢ్ జట్ల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.
నేటి నుంచి స్కేట్‌బోర్డ్ పోటీలు


