పోలీస్ శాఖలో హోంగార్డులు అంతర్భాగం
అనకాపల్లి: పోలీస్ శాఖలో హోంగార్డులు అంతర్భాగమని, అన్ని విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. 63వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 667 మంది హోం గార్డులు ఉండగా, వారిలో 93 మంది మహిళలున్నారని తెలిపారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డులకు 25శాతం రిజర్వేషన్ ఉందని చెప్పారు. అనంతరం రెండు జిల్లాల్లో ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు సర్టిఫికెట్లను ఆయన అందజేసి, గౌరవవందనం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన రావు, డీఎస్పీలు ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, వి.విష్ణు స్వరూప్, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య,సీఐలు పాల్గొన్నారు.
పోలీస్ శాఖలో హోంగార్డులు అంతర్భాగం


