వైఎస్సార్‌సీపీ టీచర్ల విభాగం అరకు అధ్యక్షుడిగా జగన్‌కుమ
సాక్షి,పాడేరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అరకు అసెంబ్లీ నియోజకవర్గ టీచర్ల విభాగం అధ్యక్షుడిగా కిల్లో జగన్‌కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం తెలిపింది.
సేంద్రియ పద్ధతులతోనే భూసార పరిరక్షణ
చింతపల్లి : గిరిజన రైతులు సేంద్రియ పద్ధతులతో పంటలు సాగు చేసినప్పుడే భూసారాన్ని పరిరక్షించుకోవచ్చని మృత్తిక శాస్త్రవేత్త పి.జోగారావు అన్నారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌లో శుక్రవారం ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పొలాల్లో రసాయన ఎరువులు,మందులు పిచికారీ చేయడం వల్ల భూమిలో సూక్ష్మ జీవుల చర్యలు తగ్గుతుందన్నారు. సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.


