రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే
ఎమ్మెల్సీ కుంభా రవిబాబు
అరకులోయ టౌన్: రాష్ట్రంలో రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అని ఎమ్మెల్సీ, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు డాక్టర్ కుంభా రవిబాబు అన్నారు. శుక్రవారం గద్యగుడలోని తన ఫాంహౌస్‌లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రవిబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతోందని, అటువంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కూటమి ప్రభుత్వానికి త్వరలో ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ అధినేత వైఎస్ జగన్‌మోహాన్ రెడ్డి సీఎం అవుతారన్నారు. తమ కార్యకర్తలకు ఇబ్బందులు గురిచేసిన వారిని ఎవ్వరిని విడిచిపెట్టె ప్రసక్తే లేదన్నారు. జగన్‌మోహన్ రెడ్డి పార్టీ స్థాపించిన నాటి నుంచి గిరిజనులంతా వైఎస్సార్‌సీపీ వెంట ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడ ఎంపీ స్థానంతోపాటు ఎమ్మెల్యే స్థానాలు కై వసం చేసుకుంటామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, ఎంపీటీసీ దురియా ఆనంద్‌కుమార్, మండల పార్టీ ఉపాద్యాక్షుడు గుడివాడ ప్రకాషరావు, మాజీ జెడ్పీటీసీ కొర్రా కాసులమ్మ, నాయకులు రేగం రమేష్, సుందర్‌రావు, రాందాస్, రాంప్రసాద్, సుభాష్‌చంద్ర, ధర్మనాయుడు, రాంనాయుడు, పట్టాసి కొండలరావు, జర్రా రఘునాథ్, చిన్నయ్య,అప్పన్న, తుమ్మాద్ పాల్గొన్నారు.


