సీనియర్ టీచర్లను టెట్ నుంచి మినహాయించాలి
ముంచంగిపుట్టు: సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మహేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో యూటీఎఫ్ మండల మహాసభను నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా యూటీఎఫ్ నేతలు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల తర్వాత ఉద్యోగ విరమణ పొందే ఉపాధ్యాయులంతా సర్వీసులో కొనసాగాలంటే రెండేళ్లలో కచ్చితంగా అర్హత పరీక్షలో టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని లేదా ఉద్యోగం నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉపాధ్యాయులను మానసికంగా ఆందోళనకు గురి చేస్తోందన్నారు. వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఉపాధ్యాయులు ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వారిని టెట్ పరీక్ష నుంచి మినహాయిండం మంచిందన్నారు. ఇందుకోసం ఆలోచన చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు దేముడు, కన్నయ్య, ధర్మారావు, అధ్యక్షులు రాజు,కా ర్యదర్శి గోపి, కార్యవర్గం త్రినాథ్, సుబ్బారావు, శ్రీనివాసమూర్తి, రఘుమణి, పుండరి, కృష్ణ, పద్మసేన పాల్గొన్నారు.
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌జిల్లా అధ్యక్షుడు మహేశ్వరరావు


