మావోయిజం వద్దు..అభివృద్ధే ముద్దు
● చింతూరులో ఆదివాసీ యువత ర్యాలీ
చింతూరు: మావోయిజం వద్దు–అభివృద్ధే ముద్దు అంటూ ఆదివాసీ యువత గురువారం డివిజన్ కేంద్రం చింతూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో అమాయకులను మట్టుపెట్ట వద్దంటూ బ్యానర్లు, ప్లకార్డులతో నినాదాలు చేశారు. మావోయిస్టులు అఘాయిత్యాలకు, విధ్వంసాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ ధోరణి వల్ల లోతట్టు గ్రామాలకు రహదారి సదుపాయాలు లేవని, నేటికీ బస్ సౌకర్యం అందుబాటులో లేదని ఆరోపించారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు వ్యతిరేకంగా యువత నినాదాలు చేశారు.


