గంజాయితో పట్టుబడితే కఠిన చర్యలు
డుంబ్రిగుడ: మండలంలోని పోలీసు స్టేషన్‌లో పాడేరు డీఎస్పీ షేక్ షెహబాజ్ అహ్మద్ గురువారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్‌లోని ఉన్న రికార్డులతో పాటు పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను ఎస్‌ఐ పాపినాయుడు వద్ద అడిగి తెలుసుకున్నారు. గంజాయి, మత్తు పదార్థాలతో పట్టుబడిన వారిపై చర్యలు తీసుకొని వారిపై కేసులు నమోదు చేయాలన ఎస్‌ఐకి సూచించారు. మద్యంతో వాహనాలు నడుపుతున్న వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టాలన్నారు. 18 సంవత్సరాలు దాటిన వాహనచోదకులు తప్పనిసరిగా లైసెన్స్‌లు కలిగి ఉండాలన్నారు. గంజాయితో పట్టుబడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు. రికార్డులు తనిఖీ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. అరకులోయ సీఐ హిమగిరి, డుంబ్రిగుడ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పాడేరు డీఎస్పీ షేక్ షెహబాజ్ అహ్మద్


