లంబసింగి ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా
చింతపల్లి: లంబసింగి ఘాట్‌రోడ్‌లో ఆటో బోల్తాపడిన సంఘటనలో గిరిజన మహిళ మృతి చెందగా మరో నలుగురు గాయపడిన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి సిఐ వినోద్‌బాబు అందించిన వివరాలిలా ఉన్నాయి. లంబసింగి నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఘాట్‌రోడ్డులో ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో కిల్లో సన్యాసమ్మ (65) అక్కడికక్కడే మృతి చెందగా లంబసింగి పంచాయతీ భీమనాపల్లి గ్రామానికి చెందిన కొర్రా జ్యోతి, కొత్తపాలెం పంచాయతీ జున్నులు గ్రామానికి చెందిన గొల్లూరి కమలమ్మ,కిల్లో సుమిత్ర, కొల్లో మోహన్‌లు గాయపడ్డారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న సిఐ వినోద్‌బాబు, ఎస్‌ఐ వెంకటేశ్వరరావులు హూటాహుటిన ససంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని, గాయపడిన వారిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులు
మహిళ మృతి, మరో నలుగురికి గాయాలు
లంబసింగి ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా


