ముగిసిన జాతీయ స్థాయి కరాటే పోటీలు
అగనంపూడి: షీల్డ్ ఫోర్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో అగనంపూడిలో నిర్వహించిన అంతర్రాష్ట్ర కరాటే పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 650 మంది క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీలను డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, నాయకులు గడసాల అప్పారావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరావు ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. క్రమశిక్షణ, స్వీయరక్షణ, స్వీయ నియంత్రణ, ఏకాగ్రత, మనో ధైర్యం, మనో వికాసం కోసం ప్రతి ఒక్కరూ కరాటేను తప్పనిసరిగా నేర్చుకోవాలని తాతారావు పేర్కొన్నారు.


