పెట్టుబడి.. లాభం..
రూ.25 వేలు
ఈ ఏడాది చిలగడ దుంప సాగు చేపట్టిన రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. గతేడాదికన్నా మార్కెట్ ధరలు కలసిరావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల పంటకాలంలో పెట్టుబడి పోను ఎకరాకు రూ.25 వేల వరకు లాభం వస్తోందని వారు తెలిపారు.
చింతపల్లి: చిలగడ దుంప సాగు సరిహద్దు ఒడిశాతోపాటు జిల్లాలో చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు. మైదాన ప్రాంత మార్కెట్లలో మంచి డిమాండ్ ఉన్నందున నష్టపోయిన సందర్భాలు తక్కువే. ఒడిశాలో నవంబర్ నాటికి దిగుబడి పూర్తవగా ఇప్పుడు ఈ ప్రాంతంలో దుంప తవ్వకాలు మొదలవుతాయి. అందువల్ల మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ఈ రెండు మండలాల్లో సుమారు 200 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరాకు తీగ నాటడం, ఎరువులు, గొప్పులు, తవ్వకాలు, గ్రేడింగ్ తదితర పనులకు రూ.25 వేల వరకు పెట్టుబడి కాగా మార్కెట్లో ధరను బట్టి సుమారుగా మరో రూ.25 వేల వరకు ఆదాయం పొందుతున్నారు.
● చింతపల్లి మండలంలో చినకొత్తూరు, చెరువూరు, చౌడుపల్లి, చెదలపాడు, గురుగూడెం, కొత్తపాలెం, అన్నవరం, ముల్లుమెట్ట, కందులగాదె, అన్నవరం, గూడెంకొత్తవీధి మండలంలో రింతాడ, దేవరాపల్లి, లక్కవరపేట, పెదవలస, కొడిసింగి, కడుగులు, దుచ్చరిపాలెం గ్రామాల్లో విస్తారంగా పండిస్తున్నారు.
● వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో దిగుబడి బాగుంది. తవ్వకాలు మొదలవడంతో రైతుల వద్దకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
● గతేడాది బస్తా (70/80 కిలోలు) రూ.800 నుంచి రూ.వెయ్యికి కొనుగోలు చేశారు. ఈ ఏడాది అదే బస్తా రూ.1200కు కొనుగోలు చేయడంతో గిరి రైతుల్లో ఆనందం నెలకొంది. జనవరి వరకు దుంప తవ్వకాలు కొనసాగడం వల్ల మరో రెండు నెలలపాటు అంచెలంచెలుగా ఆదాయం పొందే అవకాశం ఉంది.
● చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో కొనుగోలు చేసిన చిలగడ దుంపలను వ్యాపారులు జిల్లాలో పలు ప్రాంతాలతోపాటు తుని, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, తణుకు, తాడేపల్లి, ఖమ్మం, హైదరాబాదు, బెంగళూరు, చైన్నె ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలిస్తున్నారు.
● ప్రస్తుతం దుంప తవ్వకాలు, శుభ్రం చేసే పనుల్లో గిరి రైతులు నిమగ్నమయ్యారు. దుంపను తవ్విన వెంటనే బస్తాల్లో సమీప కొండ గెడ్డల వద్దకు తరలించి మట్టి లేకుండా శుభ్రం చేస్తున్నారు. బస్తాల్లో నింపిన వీటిని వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో సీజన్ ఊపందుకుంది.
సిరులు కురిపిస్తున్న
చిలగడ దుంప సాగు
బస్తా రూ.1200 ధరకు అమ్మకం
మైదానం, ఒడిశా మార్కెట్లలో
మంచి డిమాండ్
చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో సాగు పట్ల పెరుగుతున్న ఆసక్తి
గిరి రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
మంచి ఆదాయం
చిలగడ దుంప సాగు రెండు ఎకరాల్లో చేపట్టా. గత ఏడాది కంటే ఈ ఏడాది దిగుబడి బాగుంది. రెండు ఎకరాల్లో 6 టన్నుల వరకు దుంప దిగుబడి వచ్చింది. పెట్టుబడి రూ.25 వేలు కాగా రూ.25 వేల వరకు లాభం వచ్చింది. గతేడాది కన్నా మార్కెట్‌లో ధర లాభదాయకంగా ఉంది. – కిల్లో ఒప్పుగుణ, రైతు,
చెరువూరు. చింతపల్లి మండలం
ఒక్కోసారి నష్టం తప్పదు
తెలంగాణలో చిలగడ దుంప ధరను అక్కడి మార్కెట్ బోర్డు నిర్ణయిస్తుంది. మార్కెట్‌లో దిగుబడి తగ్గితే మంచి ధర ఉంటుంది. పెరిగితే పూర్తిగా ధర పతనం అవుతుంది. ఒక్కోసారి రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధర కూడా రాని పరిస్థితి ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి.
– గోవింద్,
వ్యాపారి, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా
పెట్టుబడి.. లాభం..
పెట్టుబడి.. లాభం..
పెట్టుబడి.. లాభం..


