సీనియర్ అసిస్టెంట్‌కు రెండు రోజుల జీతం కోత
అరకులోయ టౌన్: మండలంలోని మాడగడ పీహెచ్‌సీలో విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ సింహాచలంకు రెండు రోజుల జీతం కోత విధించినట్టు డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయక్ తెలిపారు. గురువారం పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆయన విధులకు ఆలస్యంగా వచ్చిన అటెండర్‌ను మందలించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అన్ని వార్డులు, ప్రసూతి గదులు, అందుబాటులో ఉన్న మందులు, వ్యాక్సిన్లను పరిశీలించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు రికార్డులు పరిశీలించారు. వైద్యాధికారి వసంత, సిబ్బంది పాల్గొన్నారు.


