పాడేరు: సేవలు విస్తృత పర్చడంలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీనూతన అంబులెన్స్ కొనుగోలు చేసింది. దీనిని గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో కలెక్టర్, రెడ్‌క్రాస్ సోసైటీ అధ్యక్షుడు ఏఎస్.దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్,ఐటీడీఏ పీవో, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ కె.చిరంజీవి నాగ వెంకట సాహిత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం విస్తృతంగా పని చేస్తుందన్నారు. ఇందుకుగాను అధికారులంతా సహకారం అందించాలని కోరారు. డిసెంబర్‌లో నిర్వహించే సమావేశంలో పూర్తిస్థాయిలో నూతన కార్యవరర్గం ఏర్పాటు చేస్తామని అన్నారు. రక్త నిల్వలు పెంచేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, రక్తదాన శిబిరాలు నిర్వహించేలా చర్యలు చేపడతామని అన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లాలో మరింత బలంగా పని చేసేందుకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్రా నాగరాజు, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, రెడ్‌క్రాస్ సొసైటీ కోశాధికారి సూర్యారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు టి.ప్రసాద్‌నాయుడు, సుబ్రహ్మణ్యం, రెడ్‌క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్లు పాల్గొన్నారు.
ప్రారంభించిన కలెక్టర్ దినేష్‌కుమార్,
ఇన్‌చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ


