మెనూ ప్రకారం ఆహారం అందించాలి
రంపచోడవరం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరణ్‌రాజ్ ఆదేశించారు. ఇర్లపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నాణ్యమైన ఆహార పదార్థాలను వేడిగా విద్యార్థులకు అందించాలన్నారు. పాలు, గుడ్లు, చికెన్, నిత్యావసర సరకుల సరఫరా వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, అనారోగ్యంగా ఉన్న పిల్లలను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తామరపల్లి మీదుగా కొండపల్లి గ్రామానికి రహదారి ఏర్పాటు చేసే విధంగా ఆ ప్రాంతాన్ని పీవో పరిశీలించారు. ఈ రహదారిలో ఎక్కడక్కెడ వంతెనలు, కల్వర్టులు నిర్మించాల్సి ఉందో నివేదికతయారు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఈఈ ఐ శ్రీనివాసరావు, డీఈ చైతన్య తదితరులు ఉన్నారు.
రంపచోడవరం పీవో స్మరణ్‌రాజ్ ఆదేశం
మెనూ ప్రకారం ఆహారం అందించాలి


