కిల్లోగుడ ఆంగ్ల మీడియం పాఠశాల తనిఖీ
డుంబ్రిగుడ: మండలంలోని కిల్లోగుడ పీహెచ్‌సీ పరిధి కిల్లోగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఆంగ్ల మీడియం పాఠశాలను గురువారం డీఎంహెచ్‌వో డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్ తనిఖీ చేశారు. దీనిలో భాగంగా విద్యార్థినుల అటెండెన్స్ పరిశీలించారు. మొత్తం 519 మంది విద్యార్థినుల్లో ఇద్దరికి చర్మ వ్యాధులు ఉన్నట్టు గుర్తించారు. పరిసరాలు, వంట గదిని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్ధులు ఆహారం అందించాలని హెచ్‌ఎం ఎం.సుజాత, డిప్యూటీ వార్డెన్‌ను ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని లేదా క్లోరినేష్‌న్ నీటిని తాగాలని సూచించారు. అనాగోగ్య సమస్యలు నెలకుంటే తక్షణమే వైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు.


