మెరుగైన విద్యుత్‌సరఫరాకు చర్యలు
● డీఈఈ వేణుగోపాల్
ముంచంగిపుట్టు: ఎటువంటి లోపాలు లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్‌శాఖ డీఈఈ వేణుగోపాల్ తెలిపారు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్‌లో మండల కేంద్రంతో పాటు పెదగూడ, మాకవరం ఫీడర్లకు చెందిన మూడు కొత్త బ్రేకర్ల పనులను గురువారం పూర్తిచేశారు.వీటిని పర్యవేక్షించిన ఆయన మాట్లాడుతూ మాకవరం ఫీడర్‌లో బ్రేకర్లు ఏర్పాటు వల్ల విద్యుత్ సరఫరాలో నెలకొన్న సాంకేతిక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. విద్యుత్‌శాఖ ఏడీఈ ప్రసాద్, ఏఈఈ సురేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


