కాయకల్ప అవార్డు బృందం సందర్శన
కోటవురట్ల : కాయకల్ప అవార్డు గ్రహీత బృందం స్థానిక సీహెచ్‌సీని గురువారం సందర్శించింది. బృందం సభ్యులు డాక్టర్ భాస్కరరావు, డాక్టరు కల్యాణ్‌రావు ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య పరీక్షలు, పరిశుభ్రత, పారిశుధ్యం, ఇన్‌ఫెక్షన్ నియంత్రణ పద్ధతులు తదితర అంశాలపై పరిశీలన చేశారు. బృంద సభ్యులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డుతో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మెరుగు పరిచేందుకు పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యర్థ పదార్థాల నిర్వహణ, పర్యావరణ అనుకూలత ప్రధానంగా ఉండాలన్నారు. విజయనగరం జిల్లాలో నాలుగు ఆస్పత్రులు, అనకాపల్లి జిల్లాలో నాలుగు ఆస్పత్రులను పరిశీలించామని, ఇందులో కోటవురట్ల ఆస్పత్రి నిర్వహణ మెరుగ్గా ఉందని తెలిపారు.


