గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌

Nov 28 2025 9:07 AM | Updated on Nov 28 2025 9:07 AM

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌

పెందుర్తి: ఓ గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడ్ని పోలీసులు గురువారం పట్టుకున్నారు. సీఐ కె.వి.సతీష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం గతేడాది జూలైలో ఏజెన్సీ నుంచి నగరానికి గంజాయి తరలిస్తుండగా పెందుర్తి పోలీసులు మాటు వేసి సరిపల్లి వద్ద పట్టుకున్నారు. అయితే ఆ సమయంలో అల్లూరి జిల్లా ముంచంగిపుట్టుకు చెందిన పంగి గోవింద్‌(30) తప్పించుకున్నాడు. ఈ క్రమంలో అతడి కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. ఏజెన్సీ ప్రాంతంలో సంచరిస్తున్న అతడిని గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement