పేదలకు సత్వర న్యాయం అందేలా కృషి
కశింకోట: పేదలకు సత్వర న్యాయం అందేలా కృషి చేస్తానని విశాఖపట్నం జిల్లా ప్రధాన న్యాయ స్థానం, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల పరిధి గ్రేడ్–1 అదనపు ప్రభుత్వ న్యాయవాది కన్నూరు అప్పలనాయుడు తెలిపారు. మండలంలోని కన్నూరుపాలెంకు చెందిన అప్పలనాయుడును ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన న్యాయస్థానం, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల పరిధిలో గ్రేడ్–1 అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా రాష్ట్ర న్యాయ శాఖ నియమించిన మేరకు విధుల్లో చేరారు. ఈ మేరకు గురువారం ఆయన్ను కుటుంబ సభ్యులు, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు కూండ్రపు రామునాయుడు, పెద్దలు పీపీఎస్ నాయుడు, రెడ్డి అప్పలనాయుడు, యడ్ల సత్యనారాయణ, తదితరులు ఇక్కడి నుంచి వెళ్లి కలిసి పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం తరపున నిజాయితీ, అంకిత భావంతో విధులు నిర్వహించి పేదలకు న్యాయ సహాయం అందిస్తానన్నారు. ప్రభుత్వం తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలకు న్యాయ ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేసి పూర్తిస్థాయిలో సేవలందిస్తామన్నారు. కార్యక్రమంలో విశాఖ బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, సిబ్బంది కూడా హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
గ్రేడ్–1 అదనపు ప్రభుత్వ న్యాయవాది
అప్పలనాయుడు


