మరికొంత కాలం ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం(విశాఖ): ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్ రైళ్లను మరికొంత కాలం పొడిగించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.పవన్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సంత్రగచ్చి–యల్లహంక(02863) వీక్లీ స్పెషల్ ప్రతి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు తెల్లవారు 2.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 2.45 గంటలకు బయలుదేరి శనివారం అర్ధరాత్రి 12.13 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్ 25వ తేదీ వరకు నడుస్తుంది. యల్లహంక –సంత్రగచ్చి(02864) వీక్లీ స్పెషల్ ప్రతి శనివారం తెల్లవారు 4.30 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి అదే రోజు రాత్రి 11.05 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 11.07 గంటలకు బయలుదేరి ఆదివారం మధ్యాహ్నం 1.25 గంటలకు సంత్రగచ్చి వెళ్తుంది. ఈ రైలు డిసెంబరు 27 వరకు నడుస్తుంది.
● చర్లపల్లి –బ్రహ్మపూర్ (07027) స్పెషల్ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటిరోజు తెల్లవారు 3.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.45 గంటలకు బయలుదేరి అదేరోజు ఉదయం 9.30 గంటలకు బ్రహ్మపూర్ వెళ్తుంది. ఈ రైలు 2026 జనవరి 30 వరకు నడుస్తుంది. బ్రహ్మపూర్–చర్లపల్లి (07028) స్పెషల్ శనివారం మధ్యాహ్నం 11.30 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 4.45 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 4.47 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 7.30గంటలకు చర్లపల్లి వెళ్తుంది. ఈ స్పెషల్ 2023 జనవరి 31వ తేదీ వరకు నడుస్తుంది.


