పోలీసుల సాయంతో గర్భిణి ఆస్పత్రికి తరలింపు
కొయ్యూరు: ఆస్పత్రికి వచ్చేందుకు నిరాకరించిన గర్భిణిని ఎట్టకేలకు పోలీసుల సాయంతో వైద్య సిబ్బంది తరలించారు. వివరాలిలా ఉన్నాయి. బూదరాళ్ల పంచాయతి లోయలపాలెంకు చెందిన డిప్పల సంధ్య ప్రసవానికి అక్టోబర్ 22 గడువు ఇచ్చారు. ఇది దాటి పదిరోజులైన ప్రసవం కాలేదు. దీంతో ఆందోళన చెందిన వైద్యసిబ్బంది ఆమెను రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తరలించేందుకు కుటుంబ సభ్యులను బతిమలాడారు. అయినప్పటికీ గర్భిణి నిరాకరించింది. దీంతో వైద్యసిబ్బంది మంప పోలీసులను ఆశ్రయించారు. వారు లోయలపాలెంలోని గర్భిణి వద్దకు వచ్చి నచ్చజెప్పారు. అనంతరం 108 వాహనంలో శుక్రవారం రాజేంద్రపాలెం పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ఆమెను పరిశీలించిన వైద్యులు శనివారం నరీపట్నం ఆస్పత్రికి తరలించనున్నారు.


