
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి
అడ్డతీగల/గంగవరం/రాజవొమ్మంగి: రంపచోడవరం డివిజన్‌లో పర్యాటక ప్రాంతాలను గుర్తించి, అభివృద్ధి చేసేందుకుచర్యలు చేపట్టనున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి స్మరణ్ రాజ్ తెలిపారు.పర్యాటక ప్రాంతాలను గుర్తించేందుకు శనివారం రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం, బీరంపల్లి,రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి, సింగంపల్లి, గంగవరం మండలంలోని పెద్ద అడ్డపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమైన ప్రాంతాలను ఎంపిక చేసి, అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే గిరిజన యువతీయువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రాజవొమ్మంగి మండలంలోజాతీయ రహదారి 516ఇకి ఇరువైపులా గల ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు. ఎన్‌హెచ్‌కు ఇరువైపుల విశ్రాంతి భవనాలు, సులభ కాంప్లెక్సులు, తాగునీటి సౌకర్యం కల్పన తదితర ఏర్పాట్ల పై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పీవో తెలిపారు.
వేటమామిడిలో సమస్యల పరిష్కారానికి కృషి
అడ్డతీగల మండలం వేటమామిడిలో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఐటీడీఏ పీవో తెలిపారు. ఈ గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ముందుగా గ్రామ సమస్యలు తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా చేయాలని గ్రామస్తులు ప్రాజెక్ట్ అధికారిని కోరారు. వెంటనే స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తహసీల్దార్లు బాలాజీ, దొరకయ్య, సత్యనారాయణ, అడ్డతీగల మండల పరిషత్ అధ్యక్షుడు రాఘవ,గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఐ. శ్రీనివాసరావు, మండల సర్వేయర్ లక్ష్మణ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి