
అమలుకు నోచుకోని ఆదివాసీ చట్టాలు
ఆదివాసీ సంక్షేమ పరిషత్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను
మాట్లాడుతున్న ఆదివాసీ సంక్షేమ పరిషత్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను
గంగవరం: ఆదివాసీల కోసం చేసిన చట్టాలు సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీ చట్టాలు పూర్తిగా నిర్వీర్యమైపోతున్నాయన్నారు. ఆదివాసీ చట్టాల అమలు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం కృషి చేయని ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో ఆదివాసీలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ బృందం రంపచోడవరం నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ దొర, డివిజన్ నాయకులు పీటా ప్రసాద్, కంగాల అబ్బాయి దొర, కలుముల ప్రసాద్, చోడి ఏడుకొండల దొర, వేట్ల హనుమంత రెడ్డి, పరద సత్యనారాయణ, కలుముల జోగి రాజు, కారం శ్రీను తదితరులు పాల్గొన్నారు.