
జీఎస్టీ తగ్గింపుతో మధ్యతరగతికి ఊరట
పాడేరు: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడం వల్ల మధ్య తరగతి ప్రజలకు ఊరట లభిస్తోందని జిల్లా ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ అన్నారు.ఽ వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సమావేశ మందిరంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ సంస్కరణలను చేపడుతోందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ ఆర్.పద్మజ, ఇన్‌చార్జ్ ఆర్డీవో లోకేశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిమళ తదితరులు పాల్గొన్నారు.