
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జి.మాడుగుల: మండలంలోని కె.కోడాపల్లి పంచాయతీ బంధవీధిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్.పూర్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు.అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ విజయ్‌కుమార్, సీడీపీవో బాలదేవి, ఏపీవో కొండబాబు, వైఎస్సార్‌సీపీ నాయకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
చింతపల్లి: స్వఛ్చాంధ్ర సాదనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చింతపల్లి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయబారతి అన్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు కళాశాల పరిసరాలను శుభ్రపరిచి మొక్కలు నాటారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస పాత్రుడు, అధ్యాపకులు కెజియా రాణి, జగదీష్, రమణ,రవీంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.
గంగవరం: స్థానిక గ్రామ సచివాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మణరావు, వైస్ ఎంపీపీ గంగాదేవి, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, కలుముల అక్కమ్మ మొక్కలు నాటారు. ఎంపీడీవో లక్ష్మణరావు మాట్లాడుతూ వాయు కాలుష్యాన్ని నియంత్రిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానికులకు అవగాహనా కల్పించారు. సత్యనారాయణమ్మ , బుల్లియమ్మ సత్యవేణి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
చింతపల్లి డిగ్రీ కళాశాలలో పరిసరాలను
శుభ్రం చేస్తున్న విద్యార్థులు
బంధవీధిలో స్థానికులకు అవగాహన కల్పిస్తున్న ఎంపీడీవో పూర్ణయ్య

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత