
పాడేరు ఇన్‌చార్జి ఆర్డీవోగా లోకేశ్వరరావు
సాక్షి, పాడేరు: పాడేరు ఇన్‌చార్జి ఆర్డీవోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.వి.ఎస్.లోకేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పాడేరు సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన సౌర్యమన్ పటేల్ మైదాన ప్రాంతానికి బదిలీ అయిన నాటి నుంచి పాడేరు సబ్‌కలెక్టర్‌గా ఎవరినీ నియమించలేదు. పాడేరు ఇన్‌చార్జి ఆర్డీవోగా ఎస్‌డీసీ లోకేశ్వరరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న
సూరిబాబు, తదితరులు
పాడేరు రూరల్: ఉత్సాహపూరిత వాతావరణంలో డివిజన్ స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వీటిని శుక్రవారం ఎస్‌జీఎఫ్ క్రీడా జిల్లా కార్యదర్శి పాంగి సూరిబాబు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిట్టబ్బాయిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విద్యా శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈనెల 22 వరకు పోటీలు జరుగుతాయన్నారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లాస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. పీఈటీలు కొండబాబు, భవాని, సత్యవతి, రాజులమ్మ, అప్పలరాజు, ప్రసాధ్ పాల్గొన్నారు.
బెల్ట్ షాపు నిర్వాహకుడిపై కేసు నమోదు
రాజవొమ్మంగి: మండలంలోని అమ్మిరేఖల గ్రామంలో మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్న చిన్నబ్బాయి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శివకుమార్ శుక్రవారం తెలిపారు. షాపు నిర్వాహకుడి నుంచి పది– 180 ఎంఎల్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొన్నామన్నారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.

పాడేరు ఇన్‌చార్జి ఆర్డీవోగా లోకేశ్వరరావు