
నూరుశాతం వంచనే!
న్యూస్‌రీల్
గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల కల్పనకు జీవో నంబరు 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవో అమలు హామీ నీటిమూటలుగానే మిగిలింది. వీటిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమల్లోకి తెస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా అరకు సభలో గిరిజనులకు హామీ ఇవ్వడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు కావస్తున్నా దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ నోరు మెదపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సూపర్ జీఎస్టీపై అవగాహన అవసరం
గిరిజన నిరుద్యోగ యువత డిమాండ్లపై స్పందించని కూటమి సర్కార్
శనివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
● కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: సూపర్ జీఎస్టీపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన అవసరమని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ కోరారు.స్థానిక కాఫీ అతిథి గృహంలో వాణిజ్య పన్నులశాఖ, ఛాంబర్ ఆప్ కామర్స్ ఏర్పాటు చేసిన రెండు రోజుల అవగాహన సదస్సు, ప్రదర్శన, పలు సామగ్రి విక్రయాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పేరుతో నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.జిల్లాలోని అన్ని గ్రామాల్లో జీఎస్టీపై ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులపై భారం తగ్గిందని, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, వాణిజ్య పన్నులశాఖ సహాయ కమిషనర్ అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
సాక్షి,పాడేరు: గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోనందున ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని గిరిజన నిరుద్యోగ యువత పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూరుశాతం ఉద్యోగాల జీవోను తేకుండానే జనరల్ డీఎస్సీతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో మోసపోయామని వారు వాపోతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో కూడా సీఎం చంద్రబాబు, ఇతర ప్రభుత్వ పెద్దలు జీవో నంబరు 3 పునరుద్ధరణ,ప్రత్యామ్నాయ జీవో జారీపై దృష్టి పెట్టలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూరుశాతం ఉపాధ్యాయ ఉద్యోగాలు తమకే దక్కుతాయని ఆఽశపడినప్పటికీ 6శాతం రిజర్వేషన్‌తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని వారు ధ్వజమెత్తుతున్నారు.
పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖలో 335, మండల పరిషత్‌లో 139 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో 6శాతం ఉద్యోగాలు మాత్రమే గిరిజన యువత పొందారు. ప్రతిభ ఆధారంగా అర్హులైన గిరిజన అభ్యర్థులు వందలసంఖ్యలో ఉన్నా నూరుశాతం ఉద్యోగాల జీవో లేకపోవడంతో గిరిజన ప్రాంతాల్లో కూడా ఓసీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు కేటాయించాల్సి పోస్టులు వచ్చింది.
నూరుశాతం ఉపాధ్యాయ పోస్టులన్నీ గిరిజనులతోనే భర్తీ చేయాలని,ఆదివాసీ ప్రజాసంఘాలు,రాజకీయ పార్టీలు ఆందోళనలు ఉధృతం చేసినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ కూడా గిరిజన అభ్యర్థుల న్యాయ సమ్మతమైన ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిచ్చింది.
గిరిజనుల డిమాండ్‌తో నాలుగు నెలల క్రితం గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు నూరుశాతం ఉద్యోగాల జీవో, గిరిజన ప్రత్యేక డీఎస్సీపై ఎలాంటి చర్చ జరగలేదు. ఐటీడీఏల స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పటికి వాటి నివేదికను కూడా ప్రభుత్వం ఇంత వరకు బహిరంగ పరచలేదు.
2026లో డీఎస్సీ, ప్రత్యేక డీఎస్సీ ఉంటుందని, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ గురువారం ప్రకటించారు. తండ్రి సీఎం చంద్రబాబు గిరిజనులకు ఇచ్చిన నూరుశాతం ఉద్యోగాల జీవోపై ఆయన మాట్లాడకపోవడంతో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూరుశాతం ఉద్యోగాల జీవో పునరుద్ధరణ, గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ డిమాండ్లతో ఉద్యమం ఉధృతం చేసేందుకు ఆదివాసీ ప్రజాసంఘాలు సిద్ధమవుతున్నాయి.
పూర్తిశాతం ఉద్యోగాలు కల్పిస్తామని
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ
ఇప్పుడు జీవో నంబరు 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవో ఊసెత్తని ఆయన, తనయుడు మంత్రి లోకేష్
ఇటీవల డీఎస్సీలో అమలు కాని హామీ
ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం
హామీ అమలుపై నోరు మెదపని సర్కార్
ప్రత్యేక డీఎస్సీ, పూర్తిశాతం ఉద్యోగాల జీవో అమలుకోసం ఆందోళన
ఉధృతానికి సిద్ధం

నూరుశాతం వంచనే!