
జిల్లాకు 474 మంది ఉపాధ్యాయుల కేటాయింపు
● త్వరలో వారంతా విధుల్లో చేరిక
● జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు
కొయ్యూరు: జిల్లాకకు 474 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయించిందని, త్వరలో వారంతా విధుల్లో చేరతారని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ట్రాల్ శిక్షణను పరిశీలించారు.శిక్షణ లక్ష్యాన్ని ఆయన ఉపాధ్యాయులకు వివరించారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు కేటాయించిన 474 మంది ఉపాధ్యాయుల్లో 335 మంది గిరిజన సంక్షేమ విభాగం, 139 మంది మండల పరిషత్ పాఠశాలకు కేటాయించిందని చెప్పారు. కొత్త వారికి పాడేరు డివిజన్‌కు సంబంధించి అరకు, రంపచోడవరం డివిజన్‌కు సంబంధించి అడ్డతీగలలో శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాలో విద్యార్థుల సామర్థ్యాన్ని 46 శాతం ఉందన్నారు. చడవడం రాయడంలో ఇతర జిల్లాలతో పోల్చితే తక్కువగా ఉందని బేస్ లైన్ పరీక్షల్లో వెల్లడైందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ దినేష్‌కుమార్ ఉపాధ్యాయులకు శిక్షణ అవసరమని సర్వ శిక్ష అభియాన్‌కు తెలపడంతో శిక్షణకు అనుమతి ఇచ్చారన్నారు.శిక్షణ పూర్తయిన తరువాత 10 నుంచి 30 విద్యార్థులకు ఒక కిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 30 దాటి ఉంటే మరో కిట్ ఇస్తామని తెలిపారు. కొత్త డీఎస్సీలో ఎంపికై న వారికి అడ్డతీగల సమీపంలో వేటమామిడి వద్ద పాఠశాలలో శిక్షణ ఇచ్చామన్నారు.అయితే 90 మంది ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్‌కు ఓటీపీలు రాకపోవడంతో వాటి కోసం వారిని గోకవరం, గంగవరం పంపించామన్నారు. అక్కడ ఓటీపీలు రావడంతో సమస్య తీరిందన్నారు. ఎంఈవోలు రాంబాబు, ప్రసాద్, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.