
పిడుగుపాటుకు ఆరు ఎద్దులు మృతి
ముంచంగిపుట్టు: మండలంలోని మాకవరం పంచాయతీ అరబీరు గ్రామ సమీపంలో శుక్రవరం సాయంత్రం పిడుగుపాటుకు ఆరు దూక్కటేద్దులు మృతి చెందాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.అరబీరు గ్రామానికి చెందిన ఎద్దులు, ఆవులు, మేకలను మేత కోసం కొండ ప్రాంతానికి తీసుకొని వెళ్లి సాయంత్రం గ్రామానికి తీసుకు వస్తున్న సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో ఎద్దులపై పిడుగు పడంతో అక్కడికి అక్కడే ఆరు దుక్కటేద్దులు మృతి చెందాయి. కాపరులు పిడుగుపాటుకు పరుగులు పెట్టారు. అరబీరు గ్రామానికి చెందిన కిరసాని జయరాంకు చెందిన నాలుగు, బలరాంకు చెందిన ఒకటి, సీతారాంకు చెందిన ఒకటి చొప్పున ఎద్దులు మృతి చెందాయి. ఒక్కో ఎద్దు రూ.30వేలు విలువ చేస్తుందని, ఎద్దులు మృతితో తీవ్ర నష్టపోయామని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు.