
సాగుకు అనుకూలంగా భూముల అభివృద్ధి
గంగవరం : పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన కొండ మొదలు గ్రామపంచాయతీ నిర్వాసిత గిరిజనులకు కేటాయించిన భూములను సాగుకు అనువుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొఖ్వల్ అన్నారు. శుక్రవారం మండలంలోని నేలదోనెలపాడు, కొండమొదలు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో నిర్వాసిత గిరిజనులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన కొండమొదలు గిరిజనులకు ల్యాండ్ టు ల్యాండ్ ఏర్పాటుకు సుమారు 160 ఎకరాలను ముందుగా గుర్తించామన్నారు. ఇవి సాగుకు అనువుగా ఉండేలా జంగిల్ క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ద్వారా ల్యాండ్ టు ల్యాండ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధి హామీ, గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో భూములను చదును చేసి సాగుకు అనువుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమశాఖ ఈఈ శ్రీనివాసరావు, ఏపీడీ ఎల్.రాంబాబు, ఉపాధి హా మీ ఏపీవో ప్రకాష్, కొండమొదలు సర్పంచ్ వేట్ల విజయ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
నిర్వాసితులకు రంపచోడవరం
సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్ హామీ