
ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
గిరిజన ప్రాంతాల్లో నూరుశాతం ఉద్యోగాలు ఆదివాసీలకు కల్పించే బాధ్యత సీఎం చంద్రబాబుపైనే ఉంది. ఎన్నికలకు ముందు ఆదివాసీలకు ఇచ్చిన హమీని ఆయన నిలబెట్టుకోవాలి.ఇటీవల జనరల్ డీఎస్సీలో ఆరు శాతం రిజర్వేషన్ అమలవ్వడంతో గిరిజన అభ్యర్థులకు అన్యాయం జరిగింది.
– రామారావుదొర,
జిల్లా అధ్యక్షుడు, ఆదివాసీ జేఏసీ
గిరిజనులకు చంద్రబాబు అన్యాయం
ఎన్నికలకు ముందు నూ రుశాతం ఉద్యోగాలన్ని ఆదివాసీలతోనే భర్తీ చేస్తానని హమీ ఇచ్చిన చంద్రబాబు సీఎం అవ్వగానే గిరిజనులకు అన్యాయం చేయడం దారుణం. 2026 డీఎస్సీ కి ముందే గిరిజన ప్రాంతాల్లో నూరుశాతం ఉద్యోగాల జీవోను కూటమి ప్రభుత్వం జారీ చేయకుంటే ఉద్యమం తప్పదు.
– మత్స్యరాస విశ్వేశ్వరరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే
న్యాయం చేసే వరకు ఉద్యమం
కూటమి ప్రభుత్వం గిరిజన అభ్యర్థులకు అన్ని ఉద్యోగాల్లోను నూరుశాతం రిజర్వేషన్ కల్పించే వరకు ఉద్యమాలు చేస్తాం. ఇటీవల డీఎస్సీలో నూరుశాతం ఉద్యోగ రిజర్వేషన్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు. నూరుశాతం ఉపాధ్యాయ ఉద్యోగాలు గిరిజనులకే వర్తించేలా చర్యలు తీసుకోవాలి.
– కూడా రాధాకృష్ణ, ప్రత్యేక డీఎస్సీ సాధన పోరాట సమితి ప్రతినిధి, పాడేరు

ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి