
పోటెత్తిన కొండగెడ్డలు
● చట్రాపల్లి, పెట్రాయి గ్రామాల్లోకి
వరద నీరు
● ఆందోళనకు గురైన ఆయా గ్రామాల గిరిజనులు
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం చట్రాపల్లి, పెట్రామి గ్రామాల్లోకి కొండగెడ్డల నీరు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కొండగెడ్డలు పోటెత్తాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఈ రెండు గ్రామాల్లో వరద ఉధృతికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడు కూడా అదేస్థాయిలో వర్షం కురవడంతో ఆయా గ్రామాల గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మరోచోట పునరావాసం కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు కోరుతున్నారు.